AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ శనివారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు 250 డయేరియా కేసులు నమోదయ్యాయని, 150 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 100 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తాగునీటి శాంపిళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించామన్నారు.