ఏకలవ్యలో 30 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు

AP: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య పాఠశాలలో 30 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు సోకినట్లు తెలిసింది. ఈ పాఠశాలలో 380 మంది విద్యార్థులు చదువుతుండగా.. 30 మంది పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 17 మంది, కేజీహెచ్‌లో ఇద్దరు, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. ఏడుగురు విద్యార్థులు డిశ్చార్జ్ అయినట్లు ఏకలవ్య సిబ్బంది చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్