AP: రాజధాని అమరావతిలో 300 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని కొండపై ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. వంద అడుగుల పాదపీఠం, 200 అడుగుల విగ్రహం ఎత్తుతో పాటు, పాదపీఠంలో మిని థియేటర్, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి.