ఏపీలో 352 వంతెనలు ప్రమాదకరంగా ఉన్నట్లు ఇంజినీర్ల తినిఖీల్లో వెల్లడైంది. ఆర్అండ్‌బీ రహదారుల్లో 1,057 వంతెనలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నట్లు, 6,609 వంతెనలు సురక్షితంగా ఉన్నట్లు ఇంజినీర్లు గుర్తించారు. ప్రమాదకరంగా ఉన్న, పాక్షికంగా దెబ్బతిన్న వంతెనలకు వెంటనే మరమ్మతులు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గుజరాత్‌లో మహిసాగర్ నదిపై వంతెన కూలిన నేపథ్యంలో ఏపీలో వంతెనల పరిస్థితిని తనిఖీ చేశారు.