AP: వెనుకబడిన జిల్లాల్లో ఉన్న 377 శిథిలమైన ఆలయాల్ని రూ.777 కోట్లతో పునర్నిర్మించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే 206 దేవాలయాల నిర్మాణం ప్రారంభమైనట్లు, మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.