AP: తిరుపతి జిల్లాలోని కోరమీను గుంటలో 6 నెలల చిన్నారి అదృశ్యమైంది. తండ్రి భూపతితో పాటు నిద్రిస్తున్న చిన్నారి రమ్య శనివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.