AP: కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువు మధ్యలో 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ మేరకు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు సమర్పించారు.