తురకపాలెంలో ‘మెలియాయిడోసిస్’ కేసు నమోదు

AP: గుంటూరు జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న తురకపాలేనికి చెందిన ఆరుగురిలో ఒకరికి ‘మెలియాయిడోసిస్’ పాజిటివ్‌ వచ్చింది. 46 ఏళ్ల ఓ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని సేకరించి పరీక్షకు పంపించగా ఈ వ్యాధి నిర్ధారణ అయింది. అలాగే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొక రోగికి మెలియాయిడోసిస్ పాజిటివ్ అని తేలింది. ఈ నెల 2 నుంచి 7 వరకు 72 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించగా.. అందులో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ గుర్తించారు.

సంబంధిత పోస్ట్