గుంటూరులోని తురకపాలెంలో సంభవిస్తున్న వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని తెలిపారు. కొత్త కేసులు నమోదు కాకుండా స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది హెల్త్ ఎమర్జన్సీగా భావించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.