నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు: మంత్రి సవిత

నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆప్కో బకాయిలను మొదటి విడతగా రూ.2 కోట్లకుపైగా చెల్లింపులు జరిగాయని మంత్రి సవిత వెల్లడించారు. 7 డివిజన్లలో 84 సొసైటీల ఖాతాల్లో బకాయిలు జమ అయినట్లు తెలిపారు. మిగిలిన బకాయిలను త్వరలో చెల్లిస్తామని అన్నారు. ఈ చెల్లింపులు సొసైటీల ఆర్థిక వ్యవహారాలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్