అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలిఅప్పరాజుపేటలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న రవి (25) అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవికి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.