AP: కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఆఫ్రికా నుంచి ఇండియా వస్తుండగా ముంబై ఎయిర్‌పోర్టులో తన ఫోన్ పోయిందని జనార్దన్ తెలిపాడు. దాంతో అతని ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో జనార్దన్ రావుకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. 2012లో లిక్కర్ వ్యాపారం ప్రారంభించిన జనార్దన్, వ్యాపారంలో పోటీ, కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2021లో హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టాడు.