AP: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.