డిగ్రీ సీట్లు పొందిన‌వారికి అలర్ట్.. రేపటి లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి

AP: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన‌ విద్యార్థులకు అలర్ట్. ఈ ఫస్ట్ ఫేజ్ లో 1,30,273 మంది సీట్లు పొందగా.. వీరు ఈ నెల 22లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే సీటు రద్దవుతుందని తెలిపారు. 1,200 కాలేజీల్లో మొత్తం 3,82,038 సీట్లు ఉండగా, మొదటి విడత తర్వాత ఇంకా 2,51,765 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి అధికారులు త్వరలోనే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్