ALERT: పిడుగులతో కూడిన వానలు

AP: కర్నూలు, తిరుపతిలో సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.

సంబంధిత పోస్ట్