AP: రాష్ట్రంలోని అన్ని వైన్ షాపుల్లో కల్తీ మద్యమే దొరుకుతోందని, కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ, జనసేన నేతలు కల్తీ మద్యం దందాను నడిపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు పల్లెపల్లెకూ పంపించారు. ప్రతిచోటా నకిలీ మద్యం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైగా లిక్కర్ కేసులంటూ మాపై అసత్య ప్రచారం చేశారు’ అని అన్నారు.