అరకు పరిధిలో దంచికొట్టిన వాన

శనివారం అరకులోయ మండల పరిసర ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం మేఘాలు కమ్ముకొని వర్షం కురవడంతో వాహనచోదకులు, బాటచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా అరకులోయ ప్రాంతంలోని వివిధ సందర్శనీయ స్థలాలను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్