హుకుంపేట: మనస్తాపంతో యువతి ఆత్మహత్య

హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ కామయ్యపేట గ్రామానికి చెందిన తేజరాణి (19), రింతాడ పంచాయతీ ఇందిరానగర్ కాలనీకి చెందిన పాంగి యువరాజు (20) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ గత మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు ఆరు నెలల్లో పెళ్లి చేయాలనుకున్నారు. శుక్రవారం వీరిద్దరి మధ్య చిన్నపాటి తగాదా జరగడంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితిలో చేరింది. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి శనివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్