అవును ఇది పాఠశాలే

అరకులోయ మండలంలోని కొత్తలుగుడా పంచాయతీ పరిధి సూపురుగుడాలో పాఠశాల భవనం నిర్మాణం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది.
దీంతో 40 మంది విద్యార్థులకు నిర్మాణ దశలో ఉన్న అంగన్‌వాడీ భవనంలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని గిరిజనులు సోమవారం తెలిపారు. పాలకులు స్పందించి సూపురుగుడాలో పాఠశాల భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్