మున్సిపల్ పారిశుధ్య కార్మికుల జీతాల నుంచి 2016 నుంచి2020 వరకు వసూలు చేసిన ఆదాయపన్ను డబ్బులను వెనక్కి ఇవ్వాలని కోరుతూ విశాఖ జివిఎంసి రెండో జోన్ కమిషనర్ ఫణిరామ్‌కు కార్మికులు వినతిపత్రంఅందజేశారు. జివిఎంసి ప్రజారోగ్య విభాగం అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2016లో ఎస్‌ఎల్‌ఎఫ్ ద్వారా జీతాలిచ్చేవారని, అప్పట్లో ఐదేళ్లపాటు నెలసరి వేతనాల నుంచి ఆదాయపు పన్ను కట్‌చేశారన్నారు.