పెదబయలు: వింత ఘటన.. మేకకు పాలిచ్చిన కుక్క

పెదబయలు మండలం మల్లెపుట్టులో ఓ గిరిజనుడికి చెందిన మేక పిల్లలు ఒక కుక్కతో కలిసి ఆడుకుంటూ, ఆ కుక్క పాలు తాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ తల్లి శునకం కూడా తన సొంత పిల్లల్లాగే వాటిని ఆప్యాయంగా చూసుకుంటూ, పాలిస్తూ, నాకుతూ ఆకలి తీరుస్తోంది. ఈ అరుదైన దృశ్యం గిరిజనులను ఆనందంలో ముంచెత్తుతోంది. మూగజీవాల్లోనూ మాతృప్రేమ ఉందని చర్చించుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్