అదుపుతప్పి పొలాల్లో బోల్తా కొట్టిన కారు

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఉండి భీమవరం నుండి కొయ్యూరు మండలం గాదిగొమ్మి గ్రామంలో ఆదివారం జరిగే శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వద్దిపర్తి కామరాజు (40), భార్య రాజామణి (35), పిల్లలు కౌసల్య, దుర్గాభవాని గాయపడ్డారు. గాయపడిన వారిని రాజవొమ్మంగి ఎస్.ఐ శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్