గిరిజన విద్యార్థిని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

మారేడుమిల్లికి చెందిన గిరిజన విద్యార్థిని సాదల రామలక్ష్మి, అనపర్తిలో జరిగిన జిల్లా స్థాయి అండర్ 17 వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈమె కొవ్వూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. రామలక్ష్మిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి లక్ష్మి, ఉపాధ్యాయులు, పీడీ వెంకటేష్, పిఈటీ వరలక్ష్మి అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్