విశాఖ: ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం జైల్ రోడ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. లోపలికి వెళ్లేందుకు దట్టంగా పొగ అలుముకోవడంతో ఇబ్బంది ఉందని ఫైర్ అఫీసర్ తెలిపారు. ఎస్బీఐకు వెనుకవైపు మంటలు చెలరేగాయని, మంటల్ని అదుపుచేసేందుకు రెండు టీమ్స్ చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్