అనకాపల్లిలో మంగళవారం ఉదయం రైలులో ప్రయాణిస్తున్న సునిక చాతర్ అనే గర్భిణికి ఏడో నెలలోనే ప్రసవ నొప్పులు వచ్చి, మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ క్షేమంగా ఉన్నారని డీసీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.