రోడ్లు భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ కు నోటీసులు జారీ చేసిన కోర్టు

చోడవరం-నర్సీపట్నం ప్రధాన రహదారి విషయంలో శనివారం అధికారులు ఇచ్చిన వాంగ్మూలంపై 9వ అదనపు జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంపై కోర్టు ఏపీ రోడ్లు భవనాలు శాఖ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసి, కేసును నవంబర్ 15కు వాయిదా వేసింది. ఆర్క్, ఫోరం ఫర్ బెటర్ చోడవరం, మండల వికలాంగుల సంక్షేమం సంఘం, న్యాయవాదుల ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయపోరాటం నేపథ్యంలో, అధికారులు, పాలకులు, కాంట్రాక్టర్ల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కోర్టు పేర్కొంది.

సంబంధిత పోస్ట్