అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచిలికి చెందిన ఉడి వెంకట శేఖర్ (39) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. తుని నుంచి అడ్డరోడుపై వేంపాడుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆయన, వేంపాడు బంకు వద్ద లారీని ఢీకొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.