పరవాడ: తీరానికి కొట్టుకు వచ్చిన విద్యార్థి మృతదేహం

పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో స్నానం చేస్తుండగా ఈనెల 1వ తేదీన గల్లంతైన విద్యార్థి భాను ప్రసాద్ (15) మృతదేహం ఆదివారం అదే తీరానికి కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్