మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీకి రూ.3 వేల కోట్లు, ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. తుఫాన్ నష్టాల అంచనాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.