అనకాపల్లి జిల్లాలో బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెండు సబ్ స్టేషన్లను ప్రారంభించారు. వ్యవసాయానికి 6,000 అగ్రికల్చర్ కనెక్షన్లు, SC,ST వర్గాల 6,000 ఇళ్లకు ఉచిత సోలార్ ప్యానెళ్లు అందించినట్లు తెలిపారు. YCP పాలనలో అధిక బిల్లులతో భారం పెరిగిందని విమర్శిస్తూ, నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు 13 పైసలు తగ్గించనున్నట్లు వెల్లడించారు.