అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద నెల రోజుల క్రితం నిర్మించిన కాజ్వే, వరద ఉధృతికి తెగి గండి పడింది. దీంతో పాడేరు, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో కూడా ఇలాగే భారీ వర్షాలకు ఈ తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయి, సుమారు రెండు నెలల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మరోసారి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.