కోటవురట్లలో వైసీపీకి భారీ షాక్

కోటవురట్లలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా మండల శాఖ అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దివంగత నేత రాజశేఖర్రెడ్డిపై అభిమానంతో వైసీపీలో చేరానని, అయితే ఇటీవల రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్