తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాయకరావుపేట మండలం మాసాహెబ్ పేటలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ సంఘటనలో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులైన జియ్యాని కాసులమ్మ, కంకిపాటి సత్తిబాబు, కంకిపాటి రామాంజనేయులు తమను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. నిరుపేద కుటుంబాలైన తమకు తక్షణ సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.