అనంతపురంలోని ఓబులదేవ నగర్ దుర్గ మాత విగ్రహం శనివారం నిమజ్జనానికి బయలుదేరింది. నిర్వాహకురాలు కవిత మాట్లాడుతూ, దసరా నవరాత్రులలో భాగంగా దుర్గా మాత విగ్రహాన్ని 13 రోజులపాటు ఏర్పాటు చేశామని, ఆఖరి రోజు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని నిమజ్జనానికి తరలించామని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, కళావతి, శ్రీదేవి, సుష్మ, హర్షిత, శేషు పాల్గొన్నారు.