విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారినిదర్శించుకున్నాఎమ్మెల్యే పరిటాల సునీత

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కోరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా ఆరవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే సునీత సన్నిహితులతో కలసి ఆలయానికి వెళ్లగా అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్