రాయదుర్గం ఓబుళాపురం మైనింగ్ కొండల్లో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ముడిఖనిజాన్ని మూడేళ్ల కిందటే ఆక్రమ రవాణా చేసినట్లు డీఎఫ్ చక్రపాణి స్పష్టం చేశారు. రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజ్ అధికారి దామోదరరెడ్డితో కలిసి ఆయన శనివారం మైనింగ్ కొండల్లో పర్యటించారు. బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో ఉందని, 15 ఏళ్లకు తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. 2009లో సీబీఐ సీజ్ చేసిన ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పరిశీలించామన్నారు.