అన్యాయానికి గురైన వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అండగా నిలిచేందుకు, భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్సిపి ఒక డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ బుక్ ను శనివారం తాడిపత్రి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ, అన్యాయానికి గురైన కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అధినేత జగన్ ప్రవేశపెట్టిన యాప్ లోకి వెళ్లి డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.