ఉరవకొండ: ఎడతెర పని వర్షానికి నానిపోయిన మొక్కజొన్న పంట

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉరవకొండ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. లత్తవరం, ఉరవకొండ గ్రామాలకు చెందిన రైతులు తమ నూర్పిడి పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పి ప్రయత్నిస్తున్నారు. రైతు రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, నాలుగు ఎకరాల్లో నూర్పిడి చేసిన పంటలో రెండు క్వింటాళ్లకు పైగా దెబ్బతిన్నదని, వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్