మేరా యువ భారత్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ యూనిటీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా మేరా యువభారత్ సభ్యుడు అజేష్ యాదవ్‌ను కలెక్టర్ సత్కరించారు. దేశాభివృద్ధి, ప్రగతి యువతతోనే సాధ్యమని, ప్రతి యువత ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమించాలని, యువత బాగుంటేనే దేశం బాగుంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.