అనంతపురం ICDS శిశు గృహలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆయాల మధ్య జరిగిన గొడవ కారణంగా పసికందుకు పాలు పట్టకపోవడంతో ఆ చిన్నారి ఆకలితో మృతి చెందింది. నిర్వాహకులు ఈ విషయాన్ని దాచిపెట్టి, శిశువును పూడ్చిపెట్టారు. ఆయాలు పరస్పరం దాడి చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిర్వాహకులు, ఆయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.