అనంతపురంలోని అశోక్ నగర్ లో బీజేపీ మండల స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, అశోక్ నగర్ మండల అధ్యక్షులు బోయ లక్ష్మణ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయిలో ఎంతో పటిష్టంగా ఉందని, ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కుళ్ళాయప్ప, నాగేంద్ర, సాయి వివేక్ పాల్గొన్నారు.