కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేసిన జిల్లా కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో, విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ.ఏ.ఎస్. అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారుణ్య నియామకాల కింద మొత్తం 78 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అవకాశం తక్కువ మందికే దొరుకుతుందని, రకరకాల శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారు ప్రజలకు మంచి సేవ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్