అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం ఆయుధ పూజ సామాగ్రి కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువారం దసరా పండుగ సందర్భంగా, కిక్కిరిసిన జనంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తోపుడు బండ్ల వారు రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోయారు. దసరా కొనుగోళ్ల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.