అనంతపురంలోని ఏడీసీసీ బ్యాంక్ కాలనీలో శంకర్ అనే వ్యక్తిని జనార్దన్ రెడ్డితో సహా నలుగురు కారులో బలవంతంగా కిడ్నాప్ చేశారు. వడియంపేట సమీపంలో ఇనుపరాడ్లు, కట్టెలతో అతి దారుణంగా కొట్టారు. గాయపడ్డ శంకర్ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు 4వ టౌన్ సీఐ జగదీష్ శుక్రవారం తెలిపారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, శంకర్ బాబు, మందారం, మహమ్మద్ తోవిద్, హనుమంత రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.