స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మిత్రులు

కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన రామకృష్ణ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో, ఆయన మిత్రులు మంగళవారం రామకృష్ణ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మిత్రులు మురళీకృష్ణ, రామాంజినేయులు, వన్నూరుస్వామి మాట్లాడుతూ, తామంతా పదవ తరగతి, ఇంటర్ చదివిన స్నేహితులమని, కలిసి ఈ సహాయం అందించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్