అనంతపురం వేమన టెలిఫోన్ భవన్ వద్ద ఉన్న షిరిడి సాయి మందిరంలో గురువారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జయ చంద్ర చౌదరి మాట్లాడుతూ, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష దీపార్చన నిర్వహించామని, భక్తులే స్వయంగా దీపాలు వెలిగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగవరం రవి, వెంకటేసులు, సుధాకర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.