శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టిడిపి నాయకులు, శ్రేయోభిలాషులు, బంధు మిత్రులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం తగ్గి ప్రజలు త్వరగా కోరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్నా ఒక ప్రత్యేక అనుభూతి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.