అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ జరిగింది. వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్ ఆనంద్‌కు వినిపించగా, ఆయన వాటిని స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.