సిద్ధరాంపురం జెడ్ పీ హై స్కూల్ కు క్రీడా పరికరాలు విరాళం

సిద్ధరాంపురం జెడ్ పీ హై స్కూల్ విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన వెంకట శివ కుమార్ 5000 రూపాయల విలువైన హాకీ స్టిక్స్ ను బుధవారం అందించారు. ఈ సందర్భంగా పీడీ నాగరాజు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని ఆకాంక్షించారు. దాత వెంకట శివ కుమార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్