శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావును మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి ఇటీవల స్వర్గస్తులైన హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావుకు నివాళి అర్పించారు. కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని అన్నారు. అనంతరం మంత్రి సత్యకుమార్ ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.